ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా దీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి వద్ద తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కొవ్వొత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా  రకరకాల నూనెలను మండించి తయారైన వెలుగులో కునికిపాట్లు పడుతుండేవారు. రాత్రిపూట వెలుగు కోసం నట్టింట్లో  నిప్పుల మంట పెట్టుకునేవారు అంతకు ముందు కొన్ని వేల సంవత్సరాల నాడు. ఇప్పుడు ప్రపంచం రకరకాల దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఈ విద్యుత్ కాంతులు మన రాత్రులను పగలుగా మార్చేశాయి. తిమిరంతో సాగిన వేలాది సంవత్సరాల సమరం మనకు ఈ విజయం సాధించింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good