ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఉద్యమానికి గర్వించదగిన చరిత్ర ఉంది. జమీందారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకే భూమి పై సర్వహక్కులూ భుక్తమయ్యేందుకు సాగించిన అసాధారణ పోరాటలే రైతు సంఘం ఆవిర్భావానికి నాంది పలికాయి. బాంచన్ దొరా.. కాల్మోక్తా... అనే తెలంగాణా రైతు జూలు విదిల్ని నిజాం నిరంకుశ కోరల్ని పీకి దున్నేవాడినే భూమి అంటూ సంహగర్జన చేసింది సంఘం సారధ్యంలోనే. నాగార్జున సాగర్, పోచంపాడు, శ్రీశైలం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులొచ్చాయంటే అది రైతు ఉద్యమాల చలవే. అలాంటి రైతు ఉద్యమాన్ని రేఖామాత్రంగా వివరించేది ఈ పుస్తకం. |