రాష్ట్రంలో అపారమైన జలవనరులున్నాయి. కృష్ణా,గోదావరి, పెన్న, తుంగభద్ర, వంశధార, నాగావళి మొదలైన అనేక నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు చిట్టచివరిలో ఉంది మన రాష్ట్రమే. మనవాటా నికర జలాలతో పాటు, మిగులు జలాలనూ వినియోగించుకోవచ్చు. అయినా థాబ్దాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సాగుభూమికి సేద్యపు నీటి సదుపాయం లేదు. వర్షమే ఆధారం. ఆర్భాటంగా ప్రభుత్వం జలయజ్ఞం ప్రారంభించినప్పటికీ, ఆ పథకం మొత్తం అవినీతితో కూరుకుపోయింది. తప్ప, సాగునీటి సదుపాయం పెరిగింది నామమాత్రమే, రైతు ఉద్యమనేత, సాగునీటి వనరులకు సంబంధించి చక్కటి పరిజ్ఞానం కలిగిన సారంపల్లి మల్లారెడ్డి రాష్ట్రంలో జలవనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని ఈ పుస్తకంలో సమర్థవంతంగా వివరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good