రసాయనశాస్త్రం ఓ అద్భుత ప్రపంచం' అనే ఈ గ్రంథం రసాయనశాస్త్ర మూలాలు - రసాయనశాస్త్ర అభివృద్ధి 20వ శతాబ్ది వరకు పరిణామ దశలు, ఆయా రసాయనశాస్త్రవేత్తల అమోఘకృషి, వారి జీవనవిధానము, ముఖ్యంగా రసాయన శాస్త్రమునకు మూలస్థంభాలు, త్రిమూర్తులువంటి జాన్‌డాల్టన్‌, రాబర్ట్‌బున్‌సెన్‌, డిమిట్రి మెండలివ్‌ల జీవన విధానం గురించి, పరిశోధనలు, నూతన ఆవిష్కరణల జీవన విధానం గురించి, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకై వారు చేసిన కృషి గురించి తెల్సుకోగలరు. ఇంకా ఎంతో మంది శాస్త్రవేత్తల అమోఘమైన కృషికూడా వుంది.
మేల్కొనింది మొదలు నిద్రపోయేవరకు మనము అనేక పనుల వ్యవహారాలలో తలమునకలయియుంటాము.   తినే తిండి, పీల్చేగాలి, త్రాగేనీరు, ధరించే వస్త్రము, అవయవాలకు ధరించే రక్షలు...ఒకటేమిటి ఇవన్నీ రసాయనశాస్త్ర సంబంధాలు.  అలాగే మన నిత్య, జీవక్రియలైన శ్వాసక్రియ, పోషకాహార స్వీకరణ, జీర్ణక్రియ, రక్తప్రసరణ విసర్జనక్రియలు వంటివి జీవరసాయన క్రియలు.  ప్రతిక్రియా నిర్వహణ, క్రియాసంఘటనలు రసాయన నిర్మితాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good