ఈ గ్రంథమందు వాదవిద్యకు సంబంధించిన విషయములును, వైద్య విద్యకు సంబంధించిన విషయములును కలిసియుండుటచే స్వయముగా గొన్ని ప్రక్రియలను చేసిచూచినగాని సంశయమువిడలేదు. 

 ఈ గ్రంథమందు మహారస, ఉపరస, సాధారణరస, ధాతు, శోధనమారణాధులు, యంత్రములు చక్కగా వ్రాయబడినవి. మరియు సాంప్రదాయభేదముల గుర్తెరుగుటకై మాతేంద్రసిద్ధి, రసార్ణవము, రససంకేతికలిక, రససారము, రసహృదయము, ఆయుర్వేద ప్రకాశము, రసమంజరి, రసరాజలక్ష్మి, రసేంద్రభాస్కరము, సిద్ధలక్ష్మీశ్వరతంత్రము, రసపద్ధతి, యోగమతము, రసేంద్ర చింతామణి, రసేంద్ర చూడామణి, రసరత్నాకరము, వాదమంజరి, నాగార్జునతంత్రము మొదలగు గ్రంథములనుండి అవసరమగు విషయములు గ్రహించి వ్రాయబడినవి. వైద్యమునకు చాలా ఉపయోగముగా ఉన్నది. - తిరువూరు వెంకటాద్రి (నూజివీడు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good