గోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరింలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి. గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం.

ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో ''మీకు లాటరీ తగిలింది... లక్షకాదు రెండు లక్షలు కాదు... పది లక్షలు'' అంటా అరిచాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good