‘ప్రతి మనిషీ ఒక వల. పక్కవాళ్ళను ఆకర్షిస్తారు. వాళ్ళను వలలో వేసుకున్నానని సంబరపడతాడు. కానీ తనూ మరొక వలలో వున్నాడన్న వివేకమే లోపం... వలలోకి వెళ్ళడమే, వల విసరడమే సుఖం. తరువాత అంతా నరకమే!’
’ఈ నవలా సంవిధానంలో సంధి బంధాలు లేవు... రచయిత తిప్పే మలుపులు, మెలికలు లేవు... క్లయిమాక్స్ లు లేవు... ఇవేవీ లేకపోయినా కేవలం జీవితాన్ని జీవితం లాగా చిత్రించి, నవలల పోటీలో ప్రథమ బహుమానం అందుకున్న రంగులవల ఈ ప్రశస్త నవల’
ఇది పైకి చాలా సాధారణంగా కనిపించే జీవిత చిత్రణ అయినప్పటికీ అది లేవనెత్తే ప్రశ్నలు మనం ఒక పట్టాన జవాబివ్వగలిగినవి కావు. ఆ ప్రశ్నల్ని ఆయన ఆ రచనలో నేరుగా, సూటిగా వెయ్యకుండా మనకు స్ఫురించే విధంగా తన సాహిత్యశిల్పాన్ని ప్రయోగించుకున్నాడు. శిల్పరీత్యా ఇదొక మేలిమి ప్రయత్నం అని చెప్పవచ్చు. పాలగుమ్మి పద్మరాజు, ఆర్.ఎం.చిదంబరం, భమిడిపాటి రామగోపాలం ఇటువంటి శిల్పచాతుర్యంతో రచనలు చేసిన వాళ్ళు. పాఠకుడు ఇటువంటి రచనను మెలకువతో సమీపించకపోతే రచనను ఎన్నటికీ నిజంగా సమీపించలేని ప్రమాదం కూడా వుంటుంది. ముప్ఫయేళ్ళ తరువాత కూడా ఈ రచనని మనం సమీపించవలసిన ఆవశ్యకత ఆ ప్రశ్నల వల్లనే కలుగుతుందని మనం గుర్తించాలి...
- చినవీరభద్రుడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good