ఈ సంపుటంలో రెండు పెద్ద కథలూ, కొన్ని వ్యాసాలూ, ఉత్తరాలూ, పాఠకులతో పరిచయాలూ ఉన్నాయి.
"నేను ఇన్నాళ్ళూ ఏ మనుకుంటున్నానంటే, హార్టులో నాలుగు గదులు వుంటాయంటారు. ఒక గదిలో మనసూ, ఇంకో గదిలో హృదయం, మూడో గదిలో ఆత్మా, అలా వుంటాయనుకుంటున్నానండీ, నాలుగో గదిలో ఏం వుంటుందో మిమ్మల్ని అడగాలని మర్చిపోతున్నాను."
డాక్టరు, చాలా సేపట్నించీ మర్చిపోయిన నవ్వంతా నవ్వాడు.
రమణ నవ్వకుండా, "మా నాన్న ఏవిటండీ, అంత పిచ్చిగా మాట్లాడాడు? నాకు అసహ్యం వేసింది" అన్నాడు.
"అదే మరి ఆయన మనసులో జబ్బు! రమణా! శరీరంలో ఎక్కడ వెతికినా మనసు దొరకదు. మన ఆలోచనలనే మనసు అనుకోవాలి. ఆలోచనలు మెదడు నుంచే పుడతాయి. మెదడుని చూడగలం గానీ, ఆలోచనల్ని చూడలేం. అంటే మనసుని చూడలేం."
"అమ్మో! ఇదేదో వేదాంతం లాగే వుందండీ! మా నాన్న సంగతి చెప్పండి! ఏం జబ్బు అది?"
"ఆయనే మనస్సు విప్పి చెప్పాలి."
"మనసు ఎక్కడా వుండదన్నారు. లేని దాన్ని ఎలా విప్పుతాడు?"
డాక్టరు నవ్వాడు. డాక్టరుకి, ప్రశ్నలంటే భలే ఇష్టం!
- ("శోష! శోష!" కథ నుంచి)

Write a review

Note: HTML is not translated!
Bad           Good