అమ్మ'కి ఆదివారం లేదా? - రంగనాయకమ్మ (50 కథల సంపుటి)

ఇందులో యాభై కథలు ఉన్నాయి. ఈ సంపుటి 'అమ్మ'కి ఆదివారం లేదా? అన్న టైటిల్‌తో వెలువడింది. గృహిణులు ఇంటి పనులకీ వంట పనులకీ వారంలో ఒకరోజు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యురాలు సరోజ్‌ కపర్దే లోగడ ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇల్లాళ్లకు వారానికి ఒకనాడైనా విశ్రాంతి అవసరమన్నది సదరు బిల్లు ఉద్దేశ్యం. అయితే రంగనాయకమ్మగారి వాదన అందుకు భిన్నం. ఈ బిల్లుకు సంబంధించిన వార్తని చూశాక ఆమె 'అమ్మకి ఆదివారం లేదా? అన్న కథ రాశారు. ఒకరోజు సెలవుతోనే అంతా చక్కబడిపోయి సమస్యలు తీరుతాయా? అని ఆమె ప్రశ్నిస్తారు.
''ఆడా మగా సమానం అవ్వాలంటే సరైన ఏకైక సూత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికీ బైటిపనీ, ఇద్దరికీ - ఇంటిపనీ! అదీ సూత్రం. బైటిపనికే సెలవులు వుంటాయి. అవి ఇద్దరికీ వుంటాయి. ఇంటిపనికి సెలవులుండవు'' - అంటూ వేణు పాత్ర ద్వారా చెబుతారు రంగనాయకమ్మ గారు. ఇక చిన్నపిల్లల్ని ముసలివాళ్లకి యిచ్చి పెళ్లిళ్లు చేయటాన్ని నిరసిస్తూ రాసిన కథ 'సంస్కరణ'. 'డబ్బు' కథ కట్నం సమస్యని చర్చిస్తుంది. ''కట్నం సమస్యలాగా కనబడే సమస్యంతా ఆస్తి  సమస్యే''నంటుంది ఇందులో ఒక పాత్ర. ఇక సంకలనం మొత్తంలోకీ ఎన్నదగినదీ, చెప్పుకోదగినదీ అయిన కథ 'కుట్ర'. భారతదేశంలో ఇంకా విప్లవం రాకపోవడానికి ఏకైక కారణం అర్థంకాని విప్లవకారుల తెలుగు రాతలేనని తీర్మానించి వారికి జడ్జిగారు పదేసేళ్ళు జైలుశిక్షలు వేసే కథ ఇది.
పెళ్లి చేసేశాం, కథా - జీవితం, మీటింగ్‌ పెళ్ళి, స్త్రీ, ఆర్తనాదం, ఆ రాత్రి, వానరాత్రి, అమ్మ, తల్లిమనసు, తృప్తి, క్షమ, దొంగ వొస్తే బాగుణ్ణు!, సుబ్బారావు ప్రేమకథ, ఆశ్చర్యం!, లంచం, బడిమానేశావేం? (చిన్న పిల్లల నాటిక), పార్వతమ్మ, కవిగారూ - కుర్రాళ్ళూ లాంటి మంచి కథలు ఈ సంపుటిలో వున్నాయి.
రాయల్‌ సైజు బాండ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good