శ్రీరామచరిత్ర పరమ పవిత్రమైనట్టిది. ఈయన చరిత్రను ప్రతినిత్యం ఎవరు పఠిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలై పోయి పరమ పవిత్రులౌతారు. ఆయుష్యాభివృద్ధి క్షేమలాభాలు కలుగుతాయి. అంత్యకాలాన మోక్షప్రాప్తి లభిస్తుంది. అంతేకాదు వీరు పొందే ఫలితం అనంతం అద్వితీయం అంటూ శ్రీరామచరితమును మొదటి నుంచి చివరి వరకూ అంతటిని పూసగ్రుచ్చినట్లు వాల్మీకి మహర్షికి నారద మునీంద్రులు తెలియజేశారు.

దివ్యజ్ఞాన పరిపూర్ణుడైన వాల్మీకి మహర్షి నారదమునీంద్రులవారు ఎఱుక పరచిన, విపులంగా వివదీకరించిన శ్రీరామకథను ఐదువందల సర్గలతో, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఆరుకాండలుగా రచించి - ఆ పిదప ఉత్తరకాండను కూడా అందించినాడు.

పేజీలు : 512

Write a review

Note: HTML is not translated!
Bad           Good