రామాయణ విషవృక్షం - ఏడు ముద్రణలు పొందిన పుస్తకం - రంగనాయకమ్మ

రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో - ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు - సుగ్రీవుడూ), స్నేహబండారం, సీతారావణులు, కాణీఖర్చులేని బహుమానం అనే ఏడు కథలూ, ఐదు లింకులూ - మూడోభాగంలో ఎంతో ఉత్తముణ్ణి! ఎన్ని కష్టాలో నాకు ! మూడో దొంగ (విభీషణుడు), రాముడు పోయాడా ?, పంచాయితీ, చెప్పుల చోట్లో రాముడు, రామరాజ్యం సొగసు అనే ఆరు కథలూ, అట్లాగే రామాయణం చదివితే లాభమేమిటి ? కవిగా వాల్మీకి, కొందరు రామయణ విమర్శకులు, రామాయణ సంస్కృతిని ఎందుకు తిరస్కరించాలి ? అన్న వ్యాసాలూ - ఉన్నాయి.

ఈ పుస్తకంలో మార్క్సిజాన్నీ, ఆంత్రపాలజీని పదునైన శైలిలో తేలికైన మాటలతో పరిచయం చేసారు రచయిత్రి రంగనాయకమ్మ. శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి ? కల్పనలో స్ఫురించే వాస్తవికత, ప్రక్షిప్తాల ఘోష, పవిత్ర రామాయణం (చిన్నకథ) కొన్ని ప్రశ్నలూ కొన్ని సందేహాలూ, కొన్ని వ్యతిరేక విమర్శలూ, కొన్ని అనుకూల విమర్శలూ శీర్షికల కింద రామాయణానికి సంబంధించిన అంశాలను చర్చిస్తారు రంగనాయకమ్మ, అంతేకాదు -
''ఈ పుస్తకం మొహం చూసిన తర్వాతో, నాలుగు ముక్కలు చదివింతర్వాతో, ఒక అగ్గిపుల్ల గీసి అంటించాలని బుద్ధి పుట్టవచ్చు ధర్మాత్ములకు, అంటిస్తే తగలబడేవి కాగితాలే కాని ఆలోచనలు కావు'' అంటున్న రంగనాయకమ్మగారి ఈ పుస్తకం, తెలుగు నాట అనేక వాద వివాదాలకు కేంద్రమైంది. రామాయణాన్ని కొత్తకోణం నుంచి చూపించే సంచలనాత్మక రచన రామాయణవిషవృక్షం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good