మన భాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన ఆదికవి. వ్యాసమహర్షిని గౌరవించాలి. ఆయన వాల్మీకి అనంతర కవి. 'భాష' అనే పదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళంతా వాల్మీకి, వ్యాసమహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శించుకోవచ్చు. కానీ మందబుద్ధితో తూర్పార పట్టకూడదు. రామాయణం ఒక నాటి సమాజం. మహాభారత మరొకనాటి సమాజం. 'రామాయణ విష వృక్షం' కర్త రంగనాయకమ్మగారికి రామాయణాన్ని చక్కగా అర్థం చేసుకోవడం బాగా తెలుసు. కానీ కమ్యూనిజాన్ని ఉద్ధరించడానికి, 'స్త్రీవాదాన్ని' ఒక అహంకార ప్రదర్శనగా రుద్దడానికి రామాయణాన్ని కకావికలం చేశారు. కమ్యూనిజాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రాచీన సాహిత్యమైన 'రామయణం'పై విరుచుకుపడ్డారు. రామాయణ గౌరవమర్యాదలకు భంగం కలిగించారు. 'రామాయణ విషవృక్షం'లోని 'విషాన్ని' కక్కించే పనిలో ఈ రచన ఎంతవరకూ సఫలం అయిందో సమాజం గమనించాలి.


మూఢ విశ్వాసాలు రామాయణం లేని రష్యాలోనూ, చైనాలోనూ మరే దేశంలోనైనా ఉన్నాయి. ఏ సమాజం కూడా మూఢ విశ్వాసాలను ఒంట పట్టించుకోమని చెప్పదు. ఇప్పుడున్న మూఢ విశ్వాసాలు 'కేవలం పురాణాల వల్ల వచ్చినవే' అనుకుంటే ఎలా? మూఢ విశ్వాసాలు అనేవి సమాజంలో మానవుల అవకాశవాదం వల్ల నిరంతరాయంగా నిలదొక్కుకున్నాయి. చదువుకున్న వాళ్ళూ మూఢ విశ్వాసాలకు అతీతులేం కాదు. ప్రతి మనిషి కొంతలో కొంతైనా ఆలోచించుకోవడానికి సమయం కేటాయించినప్పుడే ఈ దుష్పరిణామాలను తెలుసుకోగలడు.


ఆలోచనాధోరణి పేరిట వితండవాదాన్ని సృష్టించడమే అత్యాధునిక నాగరికతగా మనలో కొంతమంది భావిస్తున్నారు. ఈ వితండవాదాన్ని భవిష్యత్తుకు అందిస్తే మనది ఆలోచనా ధోరణి అవుతుందా? -  రచయిత

Write a review

Note: HTML is not translated!
Bad           Good