కల్పనకీ, వాస్తవానికీ నడుమ అంతరం ఉంది. కానీ కల్పనే వాస్తవంగా భ్రమింపజేసే ఇంద్రజాలం సృజనాత్మక సాహిత్య ప్రత్యేకత. గొప్ప ఇతిహాసాల లక్షణమిది. భారతీయ సాహిత్యంలో ఈ కోవకు చెందిన అద్భుత రచన రామాయణం. శతాబ్దాల తరబడి అనేక మార్పులు చెందుతూ జనబాహుళ్యాన ప్రాచుర్యంలో వుంది. అయితే ఇదంతా కల్పనే తప్ప వాస్తవం కాదు. కనుక రామాయణం చరిత్ర కాదు. చరిత్ర ఆధారిత రచన కూడా కాదు. అయినప్పటికీ రాముడు ఉన్నాడనీ, అతను అయోధ్యలో జీవించాడనీ చెప్పడం హాస్యాస్పదం. ఇలాంటి హాస్యాస్పదాలే ఈ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ఎజెండా కావడం విడ్డూరం. ఒకవైపున అత్యాధునిక టెక్నాలజీతో వేగవంతమైన మార్పులు వస్తుండగా, మరోవైపున అశాస్త్రీయ, అవాస్తవ భావనల పునాదిగా రాముడి గురించీ, రామజన్మభూమి గురించీ మాట్లాడటం అసంగతం. కానీ అసంగతాలు, అబద్ధాలే నిజాలుగా చెలామణవడం విషాదం. ఈ నేపథ్యాన నేటి తరానికి అవగాహన కల్పించడం, వాస్తవాల్ని ఎరుక పర్చడం, శాస్త్రీయంగా ఆలోచించేందుకు అనువైన సమాచారం, విశ్లేషణలు అందించడం తప్పనిసరి. ఈ దృష్ట్యా సి.వి. రచన 'రామజన్మభూమి-బాబ్రీ మసీదు'కు విశేష ప్రాధాన్యం ఉంది. - గుడిపాటి, కవి, విమర్శకులు

Write a review

Note: HTML is not translated!
Bad           Good