సి.ఆర్‌., లేదా రాజాజీ అని అందరూ వ్యవహరించే చక్రవర్తి రాజగోపాలాచారి (1878-1972) స్వతంత్ర భారతదేశపు గవర్నర్‌ - జనరల్‌. రాజాజీని ఒక దశలో గాంధీజీ వారసునిగా పరిగణించారు. స్వాతంత్య్రోద్యమ కాలపు అయిదుగురు అగ్రశ్రేణి కాంగ్రెస్‌ నాయకులలో నెహ్రూ, పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, మౌలానా అజాద్‌లతోపాటు ఆయన కూడా ఒకరు.

దేశ విభజన జరిగే అవకాశం ఉన్నట్లు తక్కిన కాంగ్రెస్‌ నాయకులకన్నా ముందు రాజాజీ ఊహించాడు. పాకిస్తాన్‌ బహుశా పాతికేళ్ళలో చీలిపోవచ్చునని ఆయన అప్పుడే అంచనా వేసాడు. 

1950లలో దేశం నెహ్రూ సోషలిజానికి అనుకూలంగా ఉండగా, రాజాజీ మాత్రం దానిని అవినీతికి, అభివృద్ధి రాహిత్యానికి ఆలవాలం కాగల 'పర్మిట్‌-లైసెన్స్‌ రాజ్‌' అని ఆక్షేపించాడు.

సి.ఆర్‌. వ్యక్తిగత పత్రాలు, ఆయన సమకాలిక పత్రాలు, కథనాలు, పత్రికలు, ప్రత్యక్షసాక్షులతో విస్తృతంగా జరిపిన ఇంటర్వ్యూలను ఆధారంగా చేసుకుని సాగిన ఈ రచనలో వ్యక్తిగత కోణం ఎంతున్నదో వాస్తవికత, నిష్పాక్షికత అంత కనిపిస్తాయి. భారత రాజకీయ నాయకులలో ఒక విశిష్ట వ్యక్తి గురించి ఇంతటి అద్భుతమైన చిత్రీకరణ మరొకటి లేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good