నిజానికి ఈ నాలుగు వ్యాసాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే గొలుసులో భాగాలు, ఒకే అవగాహనకు నాలుగు కోణాలు. మొదట మనిషికీ ఆయుధాలకూ మధ్య సంబంధం దగ్గర ప్రారంభించి, మానవ సమాజంలో సాధారణ కృషికీ రాజకీయ కృషికీ మధ్య సంబంధం మీదుగా, రాజకీయ కృషిలో సైద్ధాంతిక కృషికీ రోజువారీ పనులకీ మధ్య సంబంధాన్ని చర్చించి చివరికి ఆ సైద్ధాంతిక కృషి వాస్తవ ఆచరణ, సజీవ భావాల పునాదిగా ఉండాలనడం ద్వారా మనిషి దగ్గర ప్రారంభించి మనిషి దాకా సాగిన ఈ గొలుసు వ్యాసాలు కమ్యూనిస్టు ఆచరణలో, విప్లవోద్యమ నిర్మాణంలో, విప్లవానంతర సామ్యవాద సమాజ నిర్మాణంలో అత్యవసరంగా అలవరచుకోవలసిన దృక్పథాన్ని చాలా సులభంగా, సునిశితంగా వివరిస్తాయి. ఈ వ్యాసాలు చదవడం, అధ్యయనం చేయడం, లోతుగా ఆకళించుకోవడం, మన అవగాహనలో భాగం చేసుకోవడం ఇవాళ్టి చారిత్రక అవసరం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good