'ఈ సంకలనంలో కథలు స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలను తోటి స్త్రీలతో, సమాజంలో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ అల్లబడిన భావజాలానికి సంబంధించిన కథలు. మొదటి కథలన్నీ స్త్రీల శరీరం చుట్టూ పురుషాధిపత్య సమాజం ఎన్ని 'మిత్‌'లను బలంగా అల్లిందో చెప్పడానికి ప్రయత్నించిన కథలు. చివరి కథలు స్త్రీలకు తమ తోటివారితో, సమాజంలో, కుటుంబంలో వున్న సంబంధాలలో వున్న 'మిత్‌'ల గురించి రాసినవి.''
''స్త్రీకి గుర్తింపు వచ్చినదానికంటే వందరెట్టు తెలివి ఆమెకుంటుంది.
ఆ తెలివిని అణచటం సాధ్యంకాక, మొదటికే మోసం అని తెలిసి
కొంచెం అవకాశం యిస్తారు. దానికే పొంగిపోయి ఆ చోటులోనే
స్థిరపడతారు ఆడవాళ్ళు. ఆడదాని శక్తిలో, తెలివిలో సగంపైగా
సమాజంతో, ఇంట్లోవాళ్లతో  యుద్ధం చెయ్యడానికే సరిపోతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good