"పెద్దింటి బిడ్డ అయివుండి కూడా అలా వట్టి గట్టుమీద ఎలా పడుకున్నారో చూడు...." రాములు చెవి దగ్గిర చేరి గుసగుసలాడింది గోవిందమ్మ.
"నీయవ్వ..... నువ్వునోరు మూసుకోవే....సిద్ధుబాబు సంగతి నీకు సరిగ్గా తెలియదు. ఆ బాబు ఏ పనైనా చేయగలడు... కిందికి చూడకుండా ఠీవిగా కారులో తిరుగుతాడు... తిరిగి మన మల్లేశంతోపాటు చెత్తకుప్పల మధ్య లెప్ట్ రైట్ కొడతాడు... దేనికైనా సమర్థుడు..." అంటూ ఆమె నోటిని గట్టిగా అదిమాడు రాములు.
"నాకేదో భయంగా వుంది. ఈ గొడవంతా ఆ రంగూన్ భాయ్ తెలిసి, ఆడు నన్ను గుర్తుపెట్టుకుంటాడేమో!" పదినిముషాలు ఆగిన తరువాత తన సొదను మళ్ళీ మొదలుపెట్టింది గోవిందమ్మ.
"నిన్నా రంగూన్ భాయ్ గుర్తుపెట్టుకోవటమా? దగ్గిర వున్నప్పుడు సిద్ధుబాబు నీకు ఈ వేషం వేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోయినట్లయితే నువ్వెవరినో నాకు తెలిసేది కాదు" అన్నాడు రాములు.
"ఆ రంగూన్ భాయ్ పెద్ద జాదూ.... ఈ గొడవ అయ్యాక ఆడు పగబట్టి ఏదయినా జేస్తే?" అందామె.
"పీడా వదిలిపోతుంది. సినిమాలని, వేషాలని నువ్వు బజార్ల వెంట తిరుగుడు లేకుండా పోతుంది. నాకు చాలా ఖుషీగా వుంటుంది" 

Write a review

Note: HTML is not translated!
Bad           Good