1960లలో ధనం, ఐశ్వర్యం, విలాస వస్తువులతో, విశృంఖల విహారంతో దారి తప్పింది అమెరికా యువత. అన్నీ ఉన్నప్పటికీ, ఉన్నత ఆశయంతో సమాజం నడిచే దారిని విడచిపెట్టిన యువకుడు రిచి. హృదయంలో పిలుపును అనుసరిస్తూ, ప్రాణాలను తెగించి, శ్రమలకు ఓర్చి, నదులు, పర్వతాలు, అరణ్యాలు, జీవారణ్యాలు, దేశాలు, ఖండాలు దాటాడు. చివరకు భారతమాత ఒడిలో చేరి, చల్లని హిమాలయాలలో సేదతీరి, గంగా ప్రవాహం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుని, వృందావన వీధుల్లో వెన్నెల రాత్రుల్లో విహరించి పరవశించడం కథ కాదు. యదార్ధం. అదే దీ అద్భుత ఆత్మ కథ. నాగరికత ముసుగులో అతికించుకున్న నవ్వులో అవిశ్వాసం తాండవించే ఆధునిక అసహజ జగ్తులో విసిగి వేసారిన ప్రతి యువకునికీ ఈ గ్రంథం ఒక చక్కటి కరదీపికగా నిలచే అక్షర పేటిక. అందరం ఈ అమ్మ ఒడిలోకి పయనిద్ధాం. ఆ ప్రేమామృతాన్ని ఆస్వాదిద్ధాం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good