'నా స్నేహాన్ని తిరస్కరించావు నువ్వు, ప్రేమ ముందు స్నేహంతో ప్రారంభం కావాలి అని నా అభిప్రాయం. తరువాత ఆ స్నేహంతో దేహాలు దగ్గరవ్వాలి. అదీ థ్రిల్లు. ఆథ్రిల్‌ ఇంకా ఏమైనా మిగులుంటే అప్పుడు పెళ్ళవ్వాలి. నా ధియరీకి పెద్ద దెబ్బ కొట్టేసేవ్‌ రాధా నువ్వు. నీ దృష్టిలో ప్రేమనేది స్నేహం వల్లా. స్పర్శవల్లా ఉద్భవించదన్నావు, కాబట్టి - హాయిగా ఇంకెవర్నైనా ప్రేమించటం మొదలుపెట్టు. నీ మెళ్లో మూడు ముళ్ళు వేయలేదు ఫ్రెండ్‌-విప్పి చూసుకో రెండే ముళ్ళు వేసేను. బైదిబై రిజిష్ట్రార్‌ ఆఫీసుకు వెళ్ళి సంతకాల కోసం వెతక్కు. అది పాత పుస్తకాల షాపులో కొన్న లెడ్జరు - చివరగా - థాంక్స్‌ ఫర్‌ది ఎక్స్‌పీరియన్స్‌ - కృష్ణ.

పై ఉత్తరం రాధ - కుంతి నవలలో రాధకు కృష్ణ రాసినది. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమా ? పెళ్ళి చేసుకుని ప్రేమించడమా ? అనే యువకులూ ప్రేమను ముందే రుచి చూసి ఎవరితో ప్రేమో నిర్ణయించుకోవాలని ఒకరూ, ప్రధమ స్పర్శతోనే జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనే మరొకరూ సంఘర్షణ పడుతుంటే - కృష్ణుడిని ఎంచుకున్న రాధ చెడ్డదా ? కర్ణుడిని కన్న కుంతి చెడ్డదా ? అనే మీమాంసకు అనాధల్నించి ఆపదల్నుంచి ఇవతలికి ఈడ్చే 'అఆఇఈ' సంఘం ఒకటి వుంది. ఆ విచిత్ర సంఘం పరిష్కరించిందా పై నలుగురి సమస్యల్నీ ?

యండమూరి వీరేంద్రనాథ్‌ నవలా పజిల్‌ 'రాధ-కుంతి'లోకి వెళ్ళి మీరే క్లూని పట్టుకోండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good