రచయిత్రి
[సవరించి, పెంచిన ప్రతి]

ఈ నవల నేను 1965లో రాసాను ఇప్పటికి 47 సంవత్సరాల కిందట. అప్పుడు ఈ కథా విధానం అంతా బాగానే నచ్చింది కాబట్టే అలా రాశాను.
తర్వాత పుస్తకంగా కూడా గతంలో 6 ముద్రణలు వచ్చింది. కానీ ఎక్కడో అసంతృప్తి ప్రారంభమైంది. అక్కడక్కడా తప్పులు తోచడం, విమర్శలు తలెత్తడం, ప్రారంభమయ్యాయి.
ఇక దీని పునర్ముద్రణని ఆపివెయ్యాలనే ఆలోచన కూడా కొన్నాళ్ళు సాగింది. కానీ ఆ కథ మంచిది. దాన్ని పూర్తిగా ఆపివెయ్యడం కూడా ఇష్టం లేకపోయింది. ఇక మిగిలిన మార్గం, అదే కథని మళ్ళీ రాయడమే. ఆ పనే చేశాను.

సర్దుళ్ళూ, దిద్దుళ్ళూ, మార్పులూ చేర్పులూ జరిగే సరికి, నవలలో నూటికి 90 పాళ్ళు మారింది. ఈ 'తిరగ రాసే పని' 2007 చివర్లో జరిగింది.
ఈ మారిన నవల, 'ఆంధ్రప్రభ' దినపత్రికలో, డైలీ సీరియల్‌గా 2008 ఫిబ్రవరి 3 నుంచి దాదాపు 5 నెలలపాటు వచ్చింది.
ఒకే పేరూ, దాదాపు ఒకే కథ గల నవలని, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాయడమూ, ఒకే నవలని 2 సార్లు సీరియల్‌గా ప్రచురించడమూ, దీని విషయంలో జరిగాయి.

'ప్రభ'లో సీరియల్ ప్రచురణ ముగిసిన తర్వాత కూడా, నవలలో కొన్ని సందర్భాల్లో మళ్ళీ కొన్ని కొత్త పేరాలు రాశాను. అదంతా ముగిసిన తర్వాతే, సవరించిన కథ, పుస్తకంగా మొదటి ముద్రణ 2008 సెప్టెంబరులో వెలువడింది.
- రంగనాయకమ్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good