రాతిపూలు
ఇంటీరియర్‌ చాలా బావుంది కదూ...''
శమంత దీక్షగా గోడపైన పువ్వుల వంకే చూడడం గమనించి అన్నాడు రసజ్ఞ.
''రాతిపూలు'' అన్నది శమంత.
గది గోడలపైన మ్యూరల్సున్నాయి. తెల్ల పాలరాయితో చేసిన పువ్వుల కుండీలు...అందమైన తీగలు...సున్నితమైన పువ్వులు. లేత నీలిరంగు బెడ్‌లైట్‌ కాంతిలో గోడపైన పువ్వులు మిలమిల మెరుస్తున్నాయి.
''ఏమిటా ఆలోచన..ఎక్కడున్నావు..! నిన్ను చూసి ఆరు నెలలు. ఆ...రు...నెలలు...'' అన్నాడు రసజ్ఞ, శమంతను తనవైపు తిప్పుకుంటూ.
గది చల్లగా వుంది. కథల్లో చెప్పినట్లు చంద్రకాంత శిలల్లాగ గోడలోకి ఇమిడ్చి తిన్నెల్లాగా కట్టారు. వాటి పైన పరుపులు, మెత్తని దిండ్లు, ఎదురుగ్గా చిన్ని రాతి టేబుల్‌పైన ¬టల్‌ వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చిన చాక్‌లెట్‌ బాక్స్‌... రకరకాల నట్స్‌ వున్న బాక్స్‌...కాఫీ పాట్‌...రెండు కప్పులు...అంతా ఆన్సరొచ్చిన లెక్కలాగా నీట్‌గా వుంది.
శమంత చిన్నగా నవ్వింది.
''రెండు రోజులకి పన్నెండు వేలు'' అన్నది.
''ఫర్‌గెట్‌ ఇట్‌. నౌ వియ్‌ ఆర్‌ ఎంజాయింగ్‌...దట్సాల్‌'' అన్నాడు శమంతను చుట్టుకుపోతూ.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good