రాతిలో తేమ

ఈ సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. వాటిలో పదకొండు 'బహిర్లోకం' పేరుతోను, పది 'అంతర్లోకం' పేరుతో వింగడించాను. అంటే బహిర్లోకం అంటే కళ్ళముందున్న సమాజంలోని తెలుగువారి జీవితాలనీ, - అంతర్లోకం అంటే ముస్లిం జీవితాలనీ నా అభిప్రాయం. - శశిశ్రీ

రాతిలో తేమ

మా జిల్లాలో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే మునిలక్షణాలు కానీ, రత్నం అంటే గుణం కానీ లేని మనిషి, పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు.

అసలు చూడ్డానిక్కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు, తెల్ల ఖద్దరు డ్రస్సు, వంకి తిరిగిన కనుబొమలు, చేతులపై సుడులు తిరిగిన వెంట్రుకలతో నల్లగా జడసుకునేటట్లు ఉంటాడు. దానికి తోడు మొహం నిండా స్పోటకపు మచ్చలు. పోనీ మాట అయినా మంచిగా ఉంటుందా అంటే అదీ లేదు. నోరు తెరిస్తే చాలు మొరటు మాటలు, తిట్లు. నిత్యం కోపిష్టి మొహం. 

ఆయన చుట్టూ చేరే తెల్ల పంచెలోళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పంచాయితోలో కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. అలాంటి ఒక పంచాయతీ చేసే సెంటర్‌లో ఉండే పాత సినిమా హాలు, దాని ముందు కాంప్లెక్సు బలవంతంగా రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఆ సినిమా హాల్లో ఇప్పుడు సినిమాలు ఆడటం లేదు. సినిమాల్లో విలన్‌ డెన్‌ ఉంటుందే ఆ విధంగా మార్చేసుకున్నాడు. అతని దుష్ట కార్యకలాపాలకు అదే స్ధావరం....

Write a review

Note: HTML is not translated!
Bad           Good