తెలుగు వారి అదృష్టం ఏమో గానీ... సాహిత్యంలో లబ్ద ప్రతిష్టులైన వారందరూ సినిమా పాటలు రాశారు. దేవులపల్లి క్రిష్ణశాస్తి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సినారే, మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటివారు తమ గీతాలతో తెలుగు సినిమా పాటలను సుసంపన్నం చేశారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. ఆనాటి మధుర గీతాలు ఈనాటికీ ప్రజల నోళ్ళల్లో పలుకుతున్నాయి. అంటే అవి వారి ప్రతిభా వ్యుత్పత్తులే కారణం. గానం విషయానికి వస్తే ఘంటసాల, పి.సుశీల లు తెలుగు చలన చిత్ర రంగానికి లభించిన గాన గంధర్వులు. వీరు గాక పి.బి.శ్రీనివాస్‌, పి.భానుమతి, జిక్కి, లీల, ఎ.ఎమ్‌.రాజా, ఎస్‌.జానకి గార్లు కూడా ఎన్నో పాటలకు తమవంతు గాత్ర పోషణ చేశారు. ఎంఎల్‌ వసంత కుమారి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శూలమంగళం రాజ్యలక్ష్మి, రాధాజయలక్ష్మి వంటి శాస్త్రీయ సంగీత విద్వాంసుల పాటలను కూడా పరిచయం చేశాను.

బంగారం రంగు నచ్చని వారు ఉండరు. అలాంటి బంగారానికి సువాసన ఉంటే ఇంకా బాగుంటుంది. సరేదానికి రుచి కూడా ఉంటే చెప్పనక్కర్లేదు అద్భుతంగా ఉంటుంది. రంగూ, సువాసనా, రుచీగల బంగారంలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. పాట రచన రంగు లాంటిది (రచయిత), దానికి సువాసన అద్దేవాడు సంగీత దర్శకుడు, ఇంకా ఆ పాటకు రుచి కలిగించేది గాయకులు. అలాంటి రంగు, రుచి, వాసనగల 108 సౌగంధికా పుష్పాలను సమర్పించుకుంటున్నాను... ఆస్వాదించండి... - డా|| కోదాటి సాంబయ్య

పేజీలు : 270

Write a review

Note: HTML is not translated!
Bad           Good