ఉద్దేశ్యపూర్వకంగా, అస్పష్టత సృష్టించడం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో ఎప్పుడూ కొట్టొచ్చినట్టు కనపడే లక్షణం. ఈ లక్షణాన్నే ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ విభాగంగా అవతరించిన నాటి జనసంఘ్‌, నేటి బి.జె.పి.లు కూడా అనుసరిస్తున్నాయి.

వారు స్వతహాగా మతోన్మాదులు. కాని ఆ విమర్శను గట్టిగా త్రోసిపుచ్చుతూ 'జాతీయ వాదులమని' చెప్పుకుంటూ వుంటారు. తమ రాజకీయ పరిభాషలో ''హిందూ'' అనే మాట హిందూస్థాన్‌లో జన్మించిన వారందరూ అనే అర్థంలో వాడుతున్నామని నమ్మించ చూస్తారు. వారి ఖచ్చితమైన రాజకీయ విధానాలలోనూ, ప్రకటనలలోనూ మరింత స్పష్టంగా హిందువులంటే మైనారిటీలను బుజ్జగించి (ముస్లింలు, క్రైస్తవులు అని అర్థం) వారి చేతనే వేధింపులకు గురయ్యేవారని పేర్కొంటారు. 2000 సంవత్సరంలో ఒక కొత్త రంగం ప్రారంభమైంది. ఖచ్చితంగా చెప్పాలంటే పున:ప్రారంభమైంది. దీని లక్ష్యం సిక్కులే కావడం విడ్డూరమైన విషయం. ఆర్‌.ఎస్‌.ఎస్‌. నూతన అధిపతిగా కుప్పనహళ్ళి సీతారామయ్య సుదర్శన్‌ పదవినధిష్టించగానే సిక్కులపై నిందాపూర్వకమైన ప్రచారాన్ని ప్రారంభించడం చంఢీఘర్‌ నుంచి తీవ్రమైన ప్రతినిందలు రావడానికి దారి తీసింది. మన రాజకీయ వ్యవహార క్రమంలో ఈ స్తాయి నిందారోపణలు చాలా తక్కువగా వుండడం సంతోషించాల్సిన విషయమే.


Write a review

Note: HTML is not translated!
Bad           Good