''ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణచిత్రం. అందులో మనం గుర్తించగలిగేది అంతకుముందే మనసులో ఎరుకగా వున్న దాన్ని మాత్రమే! తనలోని గుర్తునే బయటా గుర్తిస్తాము' అంటారు రచయిత్రి. వసుంధరాదేవి కథల్లోని పాత్రలు మనకు తెలిసిన ప్రపంచంలోని సాదాసీదా మనుషులే! ఒక మామూలు సన్నివేశంలోంచీ అసాధారణమైన సత్యాన్ని ఆవిష్కరించే ఆమె కథలన్నింటినీ చదివినప్పుడు, రచయిత్రికున్న 'ఎరుక' ఎటువంటిదో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకునే క్రమంలో ఆ 'ఎరుక' పాఠకుడిలోనూ వెలుగుల్ని విరజిమ్మి, అతడిలోని మాలిన్యాన్ని శుభ్రపరుస్తుంది. గొప్ప సాహిత్యం అంతకంటే చేయవలసింది మరేముంటుంది?

వసుంధరాదేవి కథలన్నింటిలోనూ ప్రధాన పాత్ర స్త్రీనే! ఒక ఆఫీసరు భార్య మానసిక ప్రపంచమెంత పరిమితమో, ఆ ప్రపంచమూ అంతే పరిమితమైంది. అయితే తనకు తెలిసిన ప్రపంచపు శకలంలోంచీ అనంతమైన విశ్వ స్వరూపాన్ని దర్శించగలగడంలోనే ఆమె ప్రతిభ పాఠకుల్ని విభ్రాంతుల్ని గావిస్తుంది. యింట్లో పనిచేసే హసీనా, షాకిరాల్లాంటి మామూలు మనుషుల జీవితాల్లోంచీ రచయిత్రి పొందిన అవగాహన అసాధారణమై, ఆ పాత్రల్ని మరపురాని పాత్రలుగా రూపొందిస్తుంది. కథను రాస్తున్న వ్యక్తీ, కథలోని ప్రధాన పాత్ర స్త్రీ గావడం చేత యీ కథలన్నీ సహజసిద్ధమైన స్త్రీవాద కథలుగా గూడా తయారయ్యాయి.

Pages : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good