‘‘ఒక గొప్ప భారతదేశాన్ని అందించగల శక్తి సామర్థ్యాలుగాని, విజ్ఞానం గాని ఆర్.ఎస్.ఎస్.కి లేవు. 1963 లోనే డోనాల్డ్ యూజీన్ స్మిత్ తాను రాసిన ‘లౌకిక రాజ్యంగా భారతదేశం’ అనే పుస్తకంలో హిందూ మతతత్వం భారత దేశ ఫాసిజం రూపం అని పేర్కొన్నాడు. ఆర్ఎస్ఎస్కి ఫాసిజానికి పోలికలు ఇట్టే కనిపెట్టవచ్చు. నాయకుని సిద్ధాంతం, సైనికీకరణకి ప్రాధాన్యతనివ్వడం, జాతి`సంస్కృతుల ఆధిపత్య సిద్ధాంతం, మతతత్వ సిద్ధాంతం గల తీవ్ర జాతీయవాదం, గతకాల గొప్పదనాన్ని సూచించే గుర్తులకు ప్రాధాన్యం, జాతి సంఫీుభావ ప్రాధాన్యత, మత, ప్రాంతీయ మైనారిటీలను దేశంలో భాగంగా పరిగణించకపోవడం... ఆర్.ఎస్.ఎస్.లో ఉండే ఈ లక్షణాలన్నీ ఫాసిస్ట్ ఉద్యమాల్లో ఉండేవే. యూరప్‌లోని ఫాసిజంలో రాజ్యాన్ని ఆరాధించడం ప్రధాన లక్షణం. ఇందులో వ్యక్తి తన ఉనికిని కోల్పోతాడు. అదే అతని జీవిత పరమావధి అవుతుంది. ఇది ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతంలో లేదుÑ ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ సమాజ స్థాపన.’’
పేజీలు : 200