విశాలమైన మన భారతదేశంలో 1652 భాషలు, భాషా మాండలికాలు, వర్ధిల్లుతూ , అనేక మంది చేత మాట్లాడ బడుతున్నాయి. ఇందులో 63 భారతీయేతర భాషలు కూడా కలిసి ఉనాయి. ఇన్ని విధాలైన భాషలలో మాట్లాడటం మన భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని తెలుపుతుంది. భారత రాజ్యంగం వీటిలో 22 భాషలను మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నది. మిగిలిన భాషలను అల్ప సంఖ్యాక వర్గీయుల మాట్లాడే భాషలుగా పరిగనిస్తున్నది. 
ఒక ప్రాంతంలో వున్న వారికి ఇతర భాషలలో నేర్చుకొనే అవకాశం అంతగా ఉండనండువలన కేవలం, ఆయా భాషా స్వబోదినులే కొంతవరకు ఉపయోగ పడుతున్నాయి. అయితే చాలా స్వబోదినులు ఈ అవసరాన్ని తీర్చడంలో పూర్తిగా సహాయకారులుగా లేవు. ఈ లోటును గమనించి మేము ఇప్పటికే ఇంగ్లీష్ నేర్చు కుందాం రండి,కన్నడం నేర్చుకుందాం రండి. అనే పుస్తకాలు ముద్రించి తెలుగు మాధ్యామం ద్వారా ఆయా బాషలను నేర్చుకొనే అవకాశం కలుగ చేశాం. ఈ బుక్స్ ను షుణంగా చదివి భాషలను నేర్చుకుని తమ అవసరాలను తీర్చుకుంటారని భావిస్తూన్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good