పురాణాలలోని నీతినే పురానీతి అనే శీర్షికతో ఫన్డే పాఠకులకు కథలుగా చెబితే ఎలా ఉంటుంది అన్న మా ఫీచర్స్ అండ్ ఫండే ఎడిటర్ రామ్‌గారి ఆలోచనకు ప్రతిరూపమే పురానీతి. దాదాపు 40 వారాలపాటు నిండుపేజీతో పాఠకులకు కనువిందు చేసిన పురానీతి శీర్షిక.
ఏయే చెట్లకో ఎక్కడెక్కడో ఉన్న పూలని తెచ్చి అందంగా ఓ పూలమాలగా చేయగల శక్తి ఏ కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే ఎన్నెన్నో అక్షరాలుంటే ఆ అక్షరాలని పదాలుగా చేసి వాటిని వాక్యాలుగా తీర్చిదిద్ది చదివించుకునేతనం ఉన్న విధంగా రాయగల నేర్పరితనం అందరికీ ఉండదు. అఇ భగవద్దత్తంగా లభించాల్సిందే.
కర్మఫలం అనుభవించక తప్పదు : పరీక్షిన్మహారాజు శమీకుడనే రుషిపైన చచ్చిన పామును వేశృాడు. కోపించిన శమీకుని కుమారుడు ‘ఈ పని చేసినవారు వారం రోజులలోగా తక్షకుడి కాటుతో ప్రాణాలు కోల్పోతారు’ అని శాపాన్నిచ్చాడు. ఫలితంగా పరీక్షిన్మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు....
పేజీలు : 207