హిందూ పురాణగాధలను ఒక చట్రంలో చూడటానికి అలవాటు పడ్డ పాఠకులకు ఈ పుస్తకంలోని విషయాలు అవతలి కోణాలను కూడా పరిచయం చేస్తాయి. వాటినీ పురాణాల నుండీ తీసుకోవడం వల్ల పూర్వ సమాజాలలోని భిన్న దృక్పథాలను దర్శించటానికి అవకాశం కలుగుతున్నది.

పురాణ కర్తల కల్పనా వైచిత్రి వెనక మరుగునపడి ఉన్న వాస్తవాలను వెలికితీసే ఒక ప్రయత్నంగా దీనిని చెప్పుకోవచ్చు. జాతుల అణచివేత, పితృస్వామ్యం బలపడటం - భిన్న మతాల సంఘర్షణలు - వంటి చారిత్రక సత్యాల ఛాయలనూ ఈ రచన స్పృశిస్తున్నది.

అసురుల సంస్కృతితోనే భారతీయ సంస్కృతి ముడిపడి ఉండటాన్నీ ఈ పుస్తకం స్పష్టం చేస్తున్నది.

Pages : 380

Write a review

Note: HTML is not translated!
Bad           Good