బొమ్మల పెండ్లిండ్లు చేసి సంబర పడే పిల్లల్లాగా మనం దేవతలకు పరిణయోత్సవాలు చేస్తూ, జగజ్జననులుగా భావించబడే దేవీ మూర్తుల మెడలో వారి పుత్రులైన పూజారులే మాంగళ్యధారణ చేస్తూ ఉండగా చూసి ఔచిత్యాన్ని మరిచి పరమానందం పొందుతున్నాం. రాక్షసుల దిష్టి బొమ్మలను తగల బెట్టి అన్యాయం నశించిందని మురిసిపోతున్నాం. దేన్నైనా గుడ్డిగా నమ్మే వాళ్ళంగానే, ప్రశ్నించే స్వభావం లేనివారంగానే, నేల విడిచి సాము చేసే వారంగానే, సంశయాత్ములంగానే ఇప్పటికీ మిగిలిపోయాం. 'చదివేస్తే ఉన్న మతి పోయిందన్నట్లు' ఇంత శాస్త్రవిజ్ఞాన సంపద అందుబాటులోకి వచ్చినా ఈ ఆధునిక యుగంలో కూడా మన పాత అలవాట్లను, నమ్మకాలను మార్చుకోలేకపోతున్నాం. వాటిని ప్రశ్నించలేకపోతున్నాం. అంతేకాక మానవుని అజ్ఞానాంధకారాన్ని తొలగించే వెలుగుగా వెల్లివిరిసిన విజ్ఞాన సాధనాలను మన మూఢనమ్మకాలకు బలం చేకూర్చడానికి, వాటికి మరింత ప్రచారం కలిగించడానికి, వాటికి లేని మహిమను సంతరించి పెట్టడానికి ఉపయోగిస్తున్నాం.

మనలోని అకర్మణ్యతా భావం వల్లనే, ఉద్యమించే గుణంలేకనే బాధ్యతలనుంచి తప్పించుకునే ప్రవృత్తి వల్లనే మనం భగవంతుని రూపకల్పన, అడగంగానే సమస్త కామితార్థాలను ప్రసాదించే వాడుగా, ఆపదల్లో పిలవగానే పరిగెత్తుకొని వచ్చే సంరక్షకుడిగా, అధర్మం ప్రబలిపోయినపుడు స్వయంగా వచ్చి ధర్మసంస్థాపన చేసేవాడుగా, అన్నిటికి బాధ్యత వహించేవాడుగా చేసుకున్నామేమో! కొంగు బంగారంలాంటి ఈ భగవంతుడు ఉండగా స్వశక్తిని పెంపొందించుకునే పని మనకేముంది? తెడ్డు వుండగా చెయ్యి కాల్చుకోవలసిన పనేముంది? నారుపోసిన వాడు నీరుపోయడా? అందుకే ఎపడ్రూ ముక్కోటి దేవతల ముందు ''దేహి... దేహి... '' అని ఎల్లప్పుడు అర్థించే ప్రవృత్తి మనలో ప్రబలిపోయిందేమో! మనలోని ఈ యాచక వృత్తికి మనం సిగ్గుపడాలంటాడు, ప్రొ.ఝా.

పేజీలు :270

Write a review

Note: HTML is not translated!
Bad           Good