'పురాణం'' అంటే అతిప్రాచీనమైనదని అర్ధం. వైదికయుగంనాటి విషయాలు త్రేతాయుగ ద్వాపరయుగాల విషయ వివరణనిచ్చే గ్రంథాలను పురాణాలు అంటారు. మనకెన్నో పురాణాలు వున్నాయి. భగవాన్‌ శ్రీవేదవ్యాస మహర్షి వ్రాసినవిగా చెబుతున్న పురాణాలు పద్దెనిమిది ! వీటినే ''అష్టాదశ పురాణాలు'' అంటారు. పురాణాలను యథాతథంగా చదవటం కుదరదు. అంతటి సమయం ఓపిక ఎవరికీ లేవిపుడు. అంతేకాకుండా కొన్ని పురాణ విషయాలు స్త్రీలు చదవటానికి యోగ్యంగా లేవు. ఇపుడు అందరిలోనూ హేతువాదం ఎక్కవ అయింది. ప్రతి విషయానికీ ఏమిటీ? ఎందుకు? అలా ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. క్రొత్తతరం వారు వేస్తున్న ప్రశ్నలకు పాతతరం వారు విసుక్కొంటున్నారు. ఎందుకంటే ''పురాణాలను యథాతథంగతా స్వీకరించాలి. విమర్శించకూడదు'' అని పెద్దలైన పాతతరం వారి అభిప్రాయం.

కొత్తతరానికి పాత తరానికి ''వారధి''గా ఈ గ్రంథం రచించటం జరిగింది. పురాణ విషయాలను ప్రశ్నల రూపంలో తీసికొని వివరించటం జరిగింది. శరీరం వుందిగదా అని అన్ని అవయవాలను ప్రదర్శించడం కుదరదు గదా!'' అలాగే కావలసిన తెలుసుకోదగిన విషయాలను మాత్రమే ఈ ''పురాణ దర్శనం''లో చర్చించడం జరిగింది. ఇది భావ్యమేనని అనుకుంటున్నాను

Write a review

Note: HTML is not translated!
Bad           Good