పురాణ ప్రలాపం ఆధునిక మైథిలీ సాహిత్యంలో 'హాస్యావతారం'గా, 'వ్యంగ్యసమ్రాట్‌'గా ప్రసిద్ధి కెక్కిన హరిమోహన్‌ ఝా విలక్షణ రచన. ఆయన అమర సృష్టి 'వికటకవి చిన్నాన్న' అనే కావ్య శాస్త్ర వినోదానికి అపూర్వ భంగిమలు ప్రసాదిస్తాడు. ఆయన హాస్యలహరిలో పడి రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదాలు, పురాణాలు అన్నీ తలక్రిందులై పోతాయి. దిగ్గజ్లాంటి వ్యక్తులు మరుగుజ్జులుగానూ, సిద్ధాంతవాదులు వెర్రి వెంగళప్పలుగానూ, జీవన్ముక్తులు మట్టిముద్దలు గానూ రుజువవుతారు. అన్ని వేదశాస్త్ర పురాణాలూ ఆయన జిహ్వాగ్రంలో ఉంటాయి. ఆయన శాస్త్రాలను బంతుల్లాగా ఎగరవేసి ఆడుకుంటాడు. అలా ఆడుకుంటూనే జ్యోతిష్యాన్ని టక్కరి విద్య అనీ, ముహూర్త విద్యను ధూర్త విద్య అనీ, మంత్ర-తంత్రాలను కుట్ర అనీ, ధర్మశాస్త్రాన్ని స్వార్ధశాస్త్రమనీ రుజువు చేస్తాడు. అదేవిధంగా ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, మోక్షం, వీటన్నింటినీ ఏకి పోగులు పెడతాడు. ఈ వికటకవిని కొందరు చార్వాకుడు, నాస్తికుడు అంటే కొందరు తార్కికుడంటారు. మరికొందరు విదూషకుడంటారు. ఎవరైతేనేం? విశుద్ధ వినోదభావంతో మనోవినోద ప్రసాదం పంచి పెడతాడు. అందువల్ల అందరికీ ప్రేమపాత్రుడు. అంతేకాక ఆయన మన గుప్తజ్ఞాన సంపదను సాక్షాత్కరింపజేసే కన్నుకూడా? -హరిమోహన్‌ ఝా

Write a review

Note: HTML is not translated!
Bad           Good