వెల్‌కమ్‌ టూ లూనా-365... చంద్రమండల ప్రయాణం ఆరంభ మవుతోంది' ప్రకటనకు ఉలిక్కిపడి లేచింది సంధ్య.
21వ శతాబ్దారంభంలో మానవుడు సౌరమండల అంచులకు వ్యోమ నౌకలను పంపేవాడు. ఈలోగా చంద్రమండలంలో లూనార్‌ ఖనిజంతో పాటు 'ఫ్లూటోనియం' అధిక మొత్తంలో ఉందని తేలింది. అగ్రరాజ్యాలు ప్లూటోనియం కోసం పోటీ పటడం ఆరంభించాయి. ఆ పోటీ ఫలితంగా చంద్రమండలంలో కాలనీలు వెలిశాయి. ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్న లూనా-365 అలా ఉద్భవించిందే. ఒకరికన్నా మరొకరు వేగవంతంగా, త్వరగా చంద్రుడిపై అడుగుపెట్టాలని దేశాలు పోటీలు పడ్డాయి. ఎవరు ముందు ఏ ప్రాంతంలో అడుగుపెడితే ఆ ప్రాంతం వారిదయ్యేది. అందుకని వేగంగా ప్రయాణించే వ్యోమనౌకల తయారీ జోరందుకుంది. ఈ సమయంలో 'చంద్రబోస్‌' అనే భారతీయ శాస్త్రవేత్త చంద్రమండలానికి రాకెట్‌ను కాదు లిఫ్టును కనుగొన్నాడు. భూమినుండి చంద్రమండలానికి ఫైబర్‌మెట్లు నిర్మించాడు. అలా లూనా-365 ఆవిర్భవించింది. ఇదీ లూనా-365 కథ. 'నిజానికి మీరు ప్రయాణిస్తున్నది వ్యోమనౌక కాదు. దీన్ని 'స్పేస్‌లిఫ్ట్‌' అనవచ్చు’. మొదటిసారి చంద్రమండలం వెళ్తున్నవారి ముఖాలు ఆశ్చర్యంతో నిండిపోయాయి. 'ఎలాగయితే లిఫ్ట్‌ ఒక అంతస్తు దాటుతూ గమ్యం చేరుస్తుందో. అలాంటిదే ఈ లూనా-365 మిమ్మల్ని చంద్రమండలం పైకి చేరుస్తుంది. లిఫ్ట్‌లో మీరు నుంచుంటారు. కానీ లూనా-365లో మీరు సుఖంగా కూచోవచ్చు. పడుకోవచ్చు. కానీ బయటకు చూడండి అద్భుతమైన అంతరిక్ష దృశ్యాలు కనిపిస్తాయి. ఇటువంటి అత్యంత అనూహ్యమైన దృశ్యాలను వదలి పడుకోవాలనుకునేవారు పడుకోవచ్చు.'
ప్రకటన పూర్తి కాకముందే అందరూ బయట శూన్యంలోకి చూడసాగారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆ అంతరిక్ష దృశ్యాలను చూసేందుకు తానూ బయటకు దృష్టిని మళ్లించింది సంధ్య.

Write a review

Note: HTML is not translated!
Bad           Good