ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

బంతిపువ్వులాగ విరబూయవలసిన యౌవనం గండు తుమ్మెద పాలయింది. అంతమాత్రాన సువాసనలు వెదలజ్లే సుగుణాన్ని పువ్వులాగే స్త్రీకూడా కోల్పోదని సుకుమారంగా నిరూపిస్తారు రచయిత్రి 'పూలమనసులు' నవలలో.

పెద్దవాళ్ళ తొందరపాటుకీ తన అహంకారానికీ మధ్య నలిగి వాడిపోయిన నవప్రసూనం... రాజశ్రీ... పెళ్ళి చేసుకున్న భార్యతో బ్రతకలేక, ఆమెను దూరం చేసుకుని మనశ్శాంతి లోపించి జీవించలేక సతమతమయ్యే.. రామరాజు.

వీరి వైవాహిక జీవితకథను విరబూసిన పూలతోటగా, ఈ నవలలో ఆవిష్కరించారు శ్రీమతి మాదిరెడ్డి సులోచన.

Pages : 256

Write a review

Note: HTML is not translated!
Bad           Good