మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు.

అవుట్‌డోర్‌ షూటింగు కోసం హీరో నరహరి ఆ ప్రాంతాలకు వచ్చాడు. అతని కంటపడింది. అపరంజి బొమ్మ మీరా. కంటికింపుగా అతని గుండెల్లో చిన్న అలరింపు, ఒకింత పులకరింత.

అతడు దుష్యంతుడు.

భర్త పొందులో మీరా అమర సుఖాలు అనుభవించలేదు. నరహరి మనుష్యుల నుంచి ఈసడింపు అపారంగా పొందింది. ఇంత పెద్ద దేశంలో అంత చిన్నవాళ్ళని ఆమె పట్టించుకోలేదు.

చివరికి - జారిణిగా ఆమెపై నింద పడింది. విని తట్టుకుంది. కాని కట్టుకున్న భర్త సైతం ఆ నిందను నమ్మిన వైనానికి తల్లడిల్లిపోయింది. లోకాన్ని పట్టించుకోని మీరా భర్త వైఖరికి కృంగిపోయింది.

ఆపైన ఏమి చేసింది? ఇది ప్రశ్న! జవాబు కడు సూటిగా, హుందాగా స్త్రీ వ్యక్తిత్వానికి ఒక మణికిరీటాన్ని తొడిగిన అరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కమనీయ రచన పూజారిణి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good