నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజంలో నాకు తెలిసిన వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూశాను. మరికొన్ని విన్నాను. ఇప్పుడు ప్రతిరోజూ చదేవే పేపర్లలో , న్యూస్ మ్యాగ జైన్ ల్లోటి.వి చానల్ ల్లో మన పరిసర ప్రాంతాలలోనే కాక దేశంలోను , అంతర్జాతీయంగాను ఏంటో మంది ఆత్మహత్య చేసుకున్నవారి కథనాలను చదువుతున్నాం. వితున్నాం, చూస్తున్నాం.ఆత్మహత్య అంటే బలవంతంగా ప్రాణాలను తీసుకోవడం. ఈ బలవంతపు చావులు సమాజంలో నానాటికి పెరిగిపోతున్నాయి. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి వ్యక్తులు అనేక మార్గాలను అనుసరిస్తూ వుంటారు. ఆత్మహత్యలను కారణాలు అనేకం. ఒక్కక్క్రిది. ఒక్కోరకమైన సమస్య . సమస్యలను ఎదుర్కొనలేక విధి వంచితులై జీవితం మీద విరక్తి తో ప్రాణాలను తీసుకుంటున్నారు.
ఈ విధంగా చరిత్రలో బలవంతంగా మరణించిన వారు ఏంటో మంది వున్నారు. ఇది మనుషులలోనే కాదు. పసుపక్ష్యాదుల లోనూ వుంది. తమ జాతి మనుగడ కొనసాగించడానికి అనుకూలంగా, వాటి జాతి శ్రేయస్సే లక్షంగా లేదా వాటి జాతికి అపకారం కల్గినప్పుడు, ఆహారం కొరత ఏర్పడినప్పుడు అవి ఆత్మహత్య లను పాల్పడతాయి .ప్రతి సమస్య ఆత్మహత్యకే దారితీస్తే, రాబోయే కాలంలో సహజ మరణాల కన్నా, ఆత్మహత్యల రేటే ఎక్కువుగా వుంటుంది. మానసిక సంఘర్షణల నుండి బయటపడి వారి సమస్యలకు పరిష్కారాలను తెలియజేసి, ఎ సమస్య నుండి ఏ విధంగా బయటపడ గలిగారో వాటి వివరాలను సమగ్రంగా మీ ముందు ఉంచటమే ప్రధాన ఇతివృత్తం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good