సంజ్ఞా పరిచ్ఛేదము

క||      సత్యము శ్రేయము జనులకు

        సత్యము దక్కొండు లేదు సద్ధర్మమదే

        యత్యలఘు తప: ఫలమిడు

         నిత్యత: బాటిల్లు దాన నిఖిలార్థంబుల్‌.

     ఆంధ్ర భాషకు వర్ణంబు లేబది యైదు. 1

     ఇకార గ్రహణము సంస్కృత ప్రాకృత భాషా వ్యాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్రశాస్త్ర ప్రసిద్ధము. యవలల వలె రేఫంబును బ్రయత్న బేధంబుచే ద్వివిధంబుగాన శబ్దశాసనాదులచేత నలఘు రేఫము వర్ణాంతరముగా గ్రహింపబడదయ్యె. క్షకారము సంస్కృత వ్యాకరణముల యందును, నిఘంటువుల యందును, షాంతపద మధ్యమునందు బఠింపబడుటంజేసి యది వర్ణాంతరము గాదు; సంయుకారమని తెలియవలయు.

Pages : 250

Write a review

Note: HTML is not translated!
Bad           Good