ఒక అబ్బాయిని సృష్టించండి. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఇక ఉండకూడదు'' అంది సరస్వతి.

''సృష్టించాను'' అన్నాడు బ్రహ్మ.

''గొప్ప తెలివితేటలున్న అమ్మాయిని సృష్టించండి. ఇద్దరికీ పెళ్ళిగీత నుదుట వ్రాయండి''.

''వ్రాసాను'' అన్నాడు బ్రహ్మ.

''ఇప్పుడా అమ్మాయిని సెక్సుకి పనికి రాకుండా చేయండి''.

బ్రహ్మ అదిరిపడి ''వద్దు సరస్వతీ'' అన్నాడు కంగారుగా.

''ఏం?... మనలాంటి దేవతలకెలాగూ సాధ్యం కాదు. కనీసం మనుష్యుల కన్నా సెక్స్‌ లేకుండా ప్రేమించగలగడం సాధ్యమవుతుందేమో చూద్దాం'' - అంది సరస్వతి.

కల్యాణి, కార్తికేయ, అనూజ్ఞ - ఈ మువ్వురి చుట్టూ సాగే కథ ప్రియురాలు పిలిచె. ఈ ముగ్గురివీ మూడు భిన్న స్వభావాలు. కల్యాణిని ప్రకృతి సౌందర్యం కంటే మానేజ్‌మెంట్‌ అకౌంటెన్సీయే ఎక్కువ ఆకర్షిస్తుంది. మనిషికీ మనిషికీ మధ్య బంధం అనేది పరస్పర అవసరాల కోసం మనుష్యులు ఏర్పర్చుకునే లౌక్యపు ముడి అని ఆమె గాఢ నమ్మకం. కల్యాణి తండ్రిని ఆమె ఐదో ఏటే ఆమె మేనమామ ఆస్తి కోసం హత్య చేస్తాడు. చేదు అనుభవాలతో రాటు దేలిన కల్యాణిది పూర్తిగా మెటీరియలిస్టిక్‌ ధోరణి.

ఇక కార్తికేయ ప్రపంచమే వేరు. జమీందారీ కుటుంబంలో పుట్టినా పేదరికంలో పెరిగాడు. డబ్బు లేక మెడిసిన్‌ చివరి సంవత్సరంలో చదువు ఆపేశాడు. కుంచెలతో అందమైన బొమ్మలూ వేస్తాడు. శాంతినికేతనానికి వెళ్ళి చదువుకోవాలన్నది అతడి తీరని కోరిక. అభిమానాలకీ ఆపేక్షలకీ విలువిస్తాడు. అహం దెబ్బతిన్న కల్యాణి అతడి జీవితంలో ప్రవేశిస్తుంది. తనని పెళ్ళి చేసుకోమని కోరుతుంది. ఇంకో పక్క ఇంద్రచాపంలాంటి అనూజ్ఞ కూడా అల్లరితో కార్తికేయకు దగ్గరవుతుంది.... ఊహించని సంఘ టనలతో కథ మరెన్నో మలుపులు తిరుగుతుంది. జీవితంలో సెంటిమెంట్లకి విలువుందా ? ఏ ప్రతిఫలమూ ఆశించని ప్రేమ అసలు ప్రపంచంలో ఉంటుందా ? ప్రేమకి థర్డ్‌ డైమెన్షన్‌ ఇచ్చిన నవల - ప్రియురాలు పిలిచె

Write a review

Note: HTML is not translated!
Bad           Good