సుచరిత అతని వైపు చూసింది 'హెమ్ ' అంటూ బావురుమంది.
హేమంత్ సుచరితని గుండెలకి అదుముకున్నాడు. 'సుచి ' రవి లేకపోవటం నా జీవితంలో ఎంతో అఘాతం తెప్పించిందో నీకు తెలియదు, ఎన్నెన్నో అనుకున్నాం , వంద సంవత్సరాల జీవితం మా ముందు వున్నట్లుగా భవిష్యత్తుకి పునాదులు వేసుకున్నాం. అంటా మధ్యలో ఉంది ! ఇప్పుడు నేను ఒంటరిగా ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను. సుచీ ప్లీజ్ ! ఈ టైము లో నాకు నీ తోడూ కావాలి ! నువు ప్రక్కన వుంటే నాకు బలం వుంటుంది. ప్లీజ్ నీకు ఎవ్వరూ లేరని అనకు ! అ మాట నన్ను నిలువునా శూలంలా చేరేస్తుంది . నన్ను అర్ధం చేసుకో
సుచరిత ముఖం అతని గుండెల్లో ఆని వుంది. అతని మాటలు ఆవేదన, బాధ, ఆమె మనసులో కరడుగట్టిన శీతలాన్ని కాస్తకాస్తగా కరిగించ సాగినాయి.
ఈ ప్రపంచంలో నూటికి 90 మందికి కోరిన జీవితం దొరకదు. అది దురదృష్టం . మిగతా పదిమందికి కోరిన జీవితం లభించినా అది అనుభవించే యోగ్యత వుండదు. అది మరీ విషాదం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good