'నువ్వు ఇంత దయగల వ్యక్తిగా ఎఆల మారావు?'' ఇతరులకి సహాయం చేసే ఒకర్ని ఎవరో అడిగారు.
''నేను అనేకమంది ఆత్మ కథలని చదివాను.  వారందరిలోని దయాగుణం నాలోకి ప్రవహించింది.'' అతను జవాబు చెప్పాడు.
మంచి మనుషులు వివిధ సందర్భాల్లో దయగా ప్రవర్తించిన అనేక సంఘటనలు 'ప్రేరణ'లో చదవచ్చు.  రాతి బండ మీద చీమలు పాకుతూంటే ఎలా అక్కడ కొంత కాలానికి చార ఏర్పడుతుందో అలా ఇవన్నీ చదివాక మన మనసులో నిస్వార్థమనే చార కొంతయినా పడి స్వార్థం తగ్గి తీరుతుంది.  మంచి పనులు చేయడానికి అనేక మార్గాలు ఈ పుస్తకం చివర్లో చదవచ్చు.  మనసుకి వేదన కలిగినప్పుడు ఈ పుస్తకాన్ని చదివితే, ప్రతీ పేజీలో మీరు కలిసే, నిస్వార్ధతకి దర్పణంగా నిలిచే అనేకమంది లోని దయ, కనికరం, కారుణ్యం, ప్రేమ మొదలైన అనుకూల భావాలు మీకు తప్పక స్వాంతనని ఇస్తాయి.
గతంలో 'ఔన్నత్యం' అనే పుస్తకాన్ని అందించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అదే తరహాలో అందించే మరో పుస్తకం 'ప్రేరణ'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good