ఈనాడు కాలేజీల్లో చదువుకుంటున్న యువతీయువకులు చాలా త్వరగా ప్రేమలో పడుతున్నారు. ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. తనని ప్రేమించిన యువతి మరొకరికి దగ్గరైపోతున్నదన్న భావం ఆ యువకుడిలో ప్రతీకార వాంఛను రగిలిస్తున్నది. ఈ ప్రతీకారభావనే చాలా భయంకరమైన హింసకు కారణమౌతున్నది. ప్రేమ ఒక ఉదాత్త భావన. ప్రేమ ప్రేమించిన వారి సుఖసంతోషాలను కోరుతుంది తప్ప వాళ్ళ వినాశనాన్ని కాదు. కానీ ఈ ప్రేమే ఉన్మాదంగా మారినప్పుడు ఎలాంటి హింసాత్మక పరిస్ధితులు ఉత్పన్నమౌతాయో ఈ నవల అత్యంత వాస్తవికంగా మనోవిశ్లేషణాత్మకంగా చిత్రిస్తుంది. 'నది' మాసపత్రికలో సీరియల్‌గా వెలువడి వేలాదిమంది పాఠకుల హృదయాలను రంజింపజేసిన ఈ నవల ఇప్పుడీ పుస్తకంగా పాఠకుల ముందుకొస్తున్నది. ఇది అంపశయ్య నవీన్‌ కలం నుండి జాలువారిన 30వ నవల. పాఠకుల్ని ఆలోచింపజేస్తూ వేగంగా చదివంచే నవీన్‌ ఇతర నవలలాఏగ ఈ నవల కూడా మిమ్మల్ని తన వెంకట తీసుకెళుతుంది. నవీన్‌ ఇతర సేవల్ని ఆదరించినట్టే పాఠకులు ఈ నవలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good