Rs.70.00
In Stock
-
+
సాహిత్య ఉద్దేశ ప్రయోజనాలను గురించి విపులంగాను, హేతుబద్ధంగాను, అభ్యుదయ దృష్టితోను శ్రీ 'ప్రేమ్చంద్' ఈ గ్రంథంలో చర్చించారు.
''ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకొంది. మానవ జీవితాలను సంస్కరించే యీ సినిమాలను ధనాశకు లోబడేవాళ్ళ చేతులలో వుంచకూడదనుకొంది. ప్రజలు ఏ వస్తువులను ఎక్కువగా అభిలషించుతారో ఆ వస్తువులను తయారుచేయటమే పరిశ్రమలు ధ్యేయంగా పెట్టుకొంటాయి. ఒక వేళ ప్రజలకు తాటికల్లు యిష్టమయితే తాటికల్లు దుకాణాలు పెట్టి డబ్బు సంపాదించటానికి యత్నిస్తాయి. దీనివలన మానవుడు దైహికంగా, ఆత్మికంగా, నైతికంగా, ఆర్థికంగా, పారివారకంగా ఎంత దిగజారిపోయినా వాళ్ళు లక్ష్యపెట్టరు. ధనం సంపాదించటమే వాళ్ళ లక్ష్యము.'' - ప్రేమ్చంద్