ప్రేమ్‌చంద్‌ హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో ప్రముఖ కవి, రచయిత, సంపాదకుడు. స్వప్నలోకాల్లో తిరుగాడుతుండే ఆనాటి హిందీ సాహిత్యాన్ని యథార్థంలోకి తీసుకువచ్చాడు. పల్లెపట్టుల జీవిత విధానం అంతా ప్రేమ్‌చంద్‌ కథల్లో కనిపిస్తుంది. ఆయన కథలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రేమ్‌చంద్‌ ఉపాధ్యాయవృత్తి జీవనోపాధిగా అవలంబించాడు. అందుచేత ఆదర్శవాదం, శీలనిర్మాణం వైపు మొగ్గుచూపడం స్వాభావికం. ఆయనపైన మహాత్మాగాంధీ, టాల్‌స్టాయ్‌ల ప్రభావం బాగా వుంది.

ప్రేమ్‌చంద్‌ తన కథల్లోని పాత్రలద్వారా యావత్సమాజాన్ని నాటి చరిత్రను సజీవంగా సృష్టించాడు. తన అంతరాంతరాల్లో జీర్ణించుకున్న విషయాలనే రాయడం చేత ఆయన సృష్టించిన పాత్రలు తిన్నగా మన ఎదుట నిలబడతాయి. వాటిని గుర్తించడానికి ఏమీ సమయం పట్టదు. సామాజిక సంఘటనలు, పరిస్థితులు ఆయన అనుభవించిన జీవిత వాస్తవికత ఆయన మనస్సులో ఆవృత్తమై ఆయన కలం ద్వారా మనకు సాక్షాత్కరిస్తాయి.

పేజీలు : 179

Write a review

Note: HTML is not translated!
Bad           Good