సరిగ్గా అప్పుడే ఫోను మ్రోగింది.
ఎత్తింది సీతామహాలక్ష్మి. తండ్రి కోసమోమోనని - అక్కడ ఆయన ఉన్నాడో లేడో అని ముందు వరండాలోకి ఒకసారి తొంగి చూసింది.
"హలో! ఎవరు మాట్లాడుతోంది?".
"నేనే... మీరు?"
"నేను సీతామహాలక్ష్మినండీ, సూర్యనారాయణగారి అమ్మాయిని!"
"హమ్మయ్య! మీరేనా? దొరకరేమోనని భయపడ్డాను!"
"ఇంతకీ మీరెవరు?" విసుగ్గా అడిగింది.
"గుర్తు పట్టలేదా?"
"మీకు పేరు లేదా?" చిరాగ్గా అన్నది.
"నేను సింహాద్రినండీ!" సంతోషంగా వినబడింది అవతల కంఠం.
సీతామహాలక్ష్మికి ఆ పేరు వింటూనే ఎగిరి గంతేసినంత పనయింది. పమిట చెంగును విసురుగా దులిపి మళ్ళీ వేసుకుంది. ఆ సంతోషంలో ముందుకున్న పొడుగాతి జడను హుషారుగా వెనక్కి వేసుకుంది. నోటి వెంట మాటలే రావటం లేదన్నట్లుగా ఆ ఫోను వంకే చూస్తుండిపోయింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good