ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

ప్రేమలు - పెళ్ళిళ్ళూ

రాఘవయ్యగారు పడక కుర్చీలో మేను వాల్చి భుక్తాయాసం తీర్చుకొంటున్నారు. అతని ఆలోచనలు ఆనందమైన బావి జీవితానికి పునాదులు వేస్తున్నాయి.

''అయ్యగారూ!'' ఆలోచనలు అంతరాయం కలుగగా తలత్రిప్పి చూశాడు. వాకిట్లో పోస్ట్‌మాన్‌ నిల్చున్నాడు.

''గుమ్మంలో వెయ్యవోయ్‌! రాధా! ఒకసారిలా వచ్చిపో తల్లీ!'' లేవలేక రాధను పిలిచారు. తుండుగుడ్డతో చేతులు తుడుచుకుంటూ రాధ వచ్చింది.

''ఏం మామయ్యా, పిలిచారా?'' రాధ మాట పూర్తి కాకుండానే గుమ్మంవైపు వేలు పెట్టి చూపించారు. రాధ సన్నగా నవ్వి వెళ్ళి కవరు తీసుకుంది. రాధముఖం ఉత్తరం చూడగానే ఎరుపెక్కింది.

''ఎక్కణ్నించి తల్లీ?''

''బావ రాశారులా వుంది.'' ఉత్తరం ఆయన వడిలో వేసి విశేషాలు వినాలని అక్కడే నిలుచుంది. రాఘవయ్యగారు ఉత్తరం చదివి రాధ వైపు ప్రేమగా చూశారు.

''మోహన్‌ ఈ వారం వస్తున్నాడటమ్మా! స్నేహితులతో కలిసి ఢిల్లీ, ఆగ్రా వెళ్ళివచ్చాడట'' ఆయన మాట పూర్తికాకుండానే బాణంలా దూసుకువచ్చింది ఉష.

''ఎవరు ఢిల్లీ వెళ్ళారు నాన్నా!'' వెనకాలే బాలు కూడా వచ్చాడు.

''అప్పుడే వచ్చేశావేమ్మా?!

''ఫో నాన్నా! నేనడిగిందానికి సమాధానం చెప్పవు. పరీక్షలు అయిపోయాయిగా, అందుకే తొందరగా వదిలారు''....

పేజీలు : 165

Write a review

Note: HTML is not translated!
Bad           Good