రోజు రోజుకి కాంచన తో సాన్నిహిత్యం పెరిగిన కొద్ది దినదినం అతని ఆనందం వేయి రెట్లగా పెరుగుతోంది. చదువు లేని తనని, సంఘం రౌడీ, జులాయి అని చీదరించిన తనని కాంచన పెళ్లి చేసుకుంది. అంతేకాదు , లోకం తనని చూసిన హేళనలని, నవ్వులాటని , అపవాదులని గుండె ధైర్యంతో ఎదుర్కొంది . తన జీవితం ఆమెకే అంకితం - జయసింహ జీవన ధ్యేయం ఇది.
జీవితం అనే ప్రమిదలో నూనె వత్తిలా పరస్పర ఆలంబనతో  ఇక్యం అయినప్పుడే భార్యా భర్తల జీవితాలు వెలుగుపుంతలు అవుతాయి - ఇది కాంచన నమ్మకం.
రజనీ ఒక అందమైన పాము. ఆ పాముని నేని కోరి ప్రేమించి మెడలో వేసుకున్నాను . ఇది ఒక నా మెడలో నుంచి దిగదు. మెడలో పాము వేసుకున్న మనిషిని చూసి అందరూ భయపడతారు. అందకే నా చుట్టూ ఎవరూ ఉండటం లేదు - అతి మంచివాడైన ప్రభాకర్ ఆవేదన.
ఈ ప్రపంచం లో బాధ కలిగిన ప్రతి మనిషీ ఏడుస్తూనే ఉంటాదు ఎంతమంది కన్నీళ్ళని మనం తుడువగలం ? మనకి ఉన్న ఈ రెండు చేతులా మన కన్నీళ్లు తుడుచుకోవడానికి యిచ్చాడు దేవుడు. పరుల కోసం కాదు- స్వార్ధ పరురాలైన రజని భావన.
విబ్బిన్న మనస్తత్యాలు గల ఈ నలుగురి జీవిత చిత్రణే యద్దనపూడి సులోచనారాణి నవల - ప్రేమదీపిక.

Write a review

Note: HTML is not translated!
Bad           Good