శివరానీదేవి' అనే వితంతు బాలికను వివాహం చేసుకున్న గొప్ప సంస్కర్త ప్రేమ్‌చంద్‌. 1921లో గాంధీజీ పిలుపునందుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజలలో దేశభక్తిని, జాతీయ భావాలను ప్రేరేపించేవారు. 'మర్యాదా' అనే పత్రిక సంపాదకులు సంపూర్ణానంద్‌గారు జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళగా, కొంతకాలం ఆ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం కాశీవిద్యాపీఠంలో ఒక స్కూలుకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఉద్యోగరీత్యా గ్రామ గ్రామాలు, పల్లె పల్లెలు తిరుగుతతూ ప్రజల జీవితాలను తరచి అనేక నవలలు, కథలు, వ్యాసాలు రచించారు. ఆయన రచనలలోని పాత్రలన్నీ సజీవమైన సామాన్య ప్రజల పాత్రలే. ప్రేమ్‌చంద్‌ రచనలు అన్నీ భారతీయ భాషలలోనేగాక, రష్యన్‌, చైనీస్‌, మరియు ఎన్నో విదేశీ భాషలలో అనువదింపబడి ప్రచురించబడినాయి. ఆయన సామాన్య బడిపంతులుగా, జాతీయవాదిగా, సంఘ సంస్కర్తగా, పత్రికా సంపాదకులుగా జీవితాన్ని కొనసాగించి ఎన్నో మ¬న్నత రచనలు ప్రజల కందించి 1936 అక్టోబరు 8వ తేదీన ఈ లోకానికి దూరమై చిరస్మరణీయులైనారు శ్రీ ప్రేమ్‌చంద్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good