ఎనిమిది గంటల రాత్రి వేళ, పద్మవ్యూమం లాంటి విజయవాడ రైల్వే స్టేషన్‌ ద్గర రెండు జడలు వేసుకుని, నాజూగ్గా, ఆధునికంగా, అందంగా మొగలి పువ్వులాగ వున్న ఒక అమ్మాయి - ఓ మోస్తరు సైజు సూట్‌కేసు పట్టుకొని - రిక్షాలోంచి హడావుడిగా దిగింది! ఆ పిల్ల రిక్షావాడి చేతిలో రూపాయి తీసిపెట్టి, 'పెట్టె' వాడి చేతిలో నుంచి అందుకుని పట్టుకున్నప్పుడు - చెయ్యి కాస్త వొణుకుతున్నట్లు రిక్షావాడు గమనించాడు! అప్పటికే కొన్ని డజన్ల కళ్ళు ఆమెని వెంటాడాయి. ఆమె బుకింగ్‌ హాలు మెట్లెక్కింది. ఆ పిల్లకి చాలామంది చూపులు తననే వెంటాడుతున్నట్లు అనిపించింది.

దానిక్కారణం - ఒంటరి పడుచుపిల్ల కంగారుగా వెతుకుతున్నప్పుడు మామూలుగా జనంలో కలిగే కుతూహలం కావచ్చును లేదా భయంచేతో తొందరపాటువల్లో ఆ పిల్ల నడకలో కనబడే తొట్రుపాడు కావచ్చును!

రాత్రిపూట కూడా నల్లకళ్ళద్దాలు పెట్టుకొని, బ్రీఫ్‌ కేసుతో, రైలు స్టేషన్‌ లోపలికి హడావుడిగా వచ్చిన ఆడపిల్ల వేపు, రకరకాలుగా చూడకుండా వుండటం ఎక్కడా జరగదు... పైగా, అది విజయవాడ జంక్షన్‌ అక్కడ 'ఆడవాసనల్లే అదోరకం దృష్టితో చూస్తారు ఎంతోమంది!.....

పేజీలు : 248

Write a review

Note: HTML is not translated!
Bad           Good