ఈ పుస్తకం 'స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్‌-అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.

    అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం, వారి మైనస్‌-పాయింట్స్‌ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం... ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేధించటానికి వెనుకాడడు కూడా. కానీ విభేధం వేరు, శత్రుత్వం వేరు).

ఈ పుస్తకంలో....

స్నేహం : స్నేహంలోంచి ప్రేమలోకి...స్నేహితుల్లో రకాలు...అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పే స్నేహితులు...ఖరీదైన స్నేహాలు...మంచి స్నేహితుడి పది లక్షణాలు... స్నేహం స్వార్థమా?... ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?

ప్రేమ : తూపు తొలి చూపు... తొలి స్పర్శ... పప్పీ లవ్‌... పెళ్ళికి ముందు ప్రేమ... ప్రేమ వివాహాలు... పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు... ప్రేమలో ఎమోషన్స్‌... ప్రేమ - ఈర్ష్య.

దాంపత్యం : ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే... లివ్‌-ఇన్‌-రిలేషన్‌... సెకండ్‌ సెటప్‌... సర్దుబాటు.

శృంగారం : వద్దనకు ఈ ముద్దు ... రొమాన్స్‌... వాత్సాయన... విరహ వర్ణన... శృంగారానికి ఆరు మెట్లు

అనుబంధం : మూడు రకాల అనుబంధాలు ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good