మదన్ సరాసరి లోపలి వచ్చాడు.
అతని చూడగానే సుజాత నిటారుగా అయింది.
హలో ! నవ్వుతూ పలుకరించాడు. అతని ముఖంలో లజ్జ కానీ సంకోచం కానీ ఈషణ్మాత్రం కూడా లేవు. సుజాతకి అతనంటే కలిగిన అసహ్యం రెట్టింపు అయింది.
యందుకు వచ్చావు యిక్కడికి ? రోషంగా అడిగింది.
నా కాబోయే భార్యని ఒక్కసారి చూద్దామని
"నేను నీ భార్యను కావడంలేదు ఈ పెళ్లి జరగడం లేదు.
ఇంతదూరం వచ్చిన తర్వత ఈ పెళ్లి అవడం నీ తరం అనుకుంటున్నావా?
నా పెళ్లి నాయిష్టం లేకుండా జరిపించడం ఎవరి తరమూ కాదు..
నువ్వు నాన్ను తపించుకోలేవు ఆ ఉత్తరాలు ఎందుకు వ్రాశావు ? నాలో మోహాన్ని ఎందుకు పెంచావు ? పెళ్లి వరకు తీసుకొని వచ్చి ఇప్పుడు కాదని నలుగురిలో నన్ను నవ్వులపాలు చేసిన నీ దోవని నువ్వు పోతానని అంటే చేతకాని వెధవలా గాజులు తొడిగించుకొని చూస్తూ వూరు కుంటాననుకున్నావా ?
మనసారా ప్రేమించిన మనిషి అసలు రంగు అది కాదని బయట పడటంతో సుజాత ఎదురు తిరిగింది. అతనితో పెళ్లి వద్దనుకుంది. సుజాత ఈ విషవలయంలో నుంచి బయటపడిండా ? సుజాత భర్త రవి ఎలా రియాక్ట్ అయ్యాడు ? ప్రేమ పేరుతొ మోసపోయిన ఆడపిల్ల జీవితం ఎన్ని ఒడుదుడుకులను లోనవుతుందో ఎన్ని కడగండ్ల పాలవుతుందో ప్రతిభావంతంగా చిత్రించిన యద్దనపూడి సులోచనారాణి నవల ప్రేమలేఖలు . ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా చలనచిత్రం గా వెలువడి విజయ వంతమైనది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good